హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంతలతో అధ్వాన్నంగా మారిన రహదారి

ASF: బెజ్జూర్ మండలం సులుగుపల్లి ప్రధాన రహదారి అధ్వాన్నంగా మారింది. భారీ గుంతలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మూడేళ్లుగా ఇదే పరిస్థితి ఉందని, ఏటా మొరం పోసేవారని స్థానికులు తెలిపారు. ఈ సారి పనులు చేపట్టకపోవడంతో గుంతలు మరింత పెరిగాయన్నారు. వర్షాలకు గుంతల్లో నీరు చేరి ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు రహదారిని బాగుచేయాలని కోరుతున్నారు.