హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సైబరాబాద్ సీపీ

SRD : రామచంద్రాపురం పరిధిలోని రాయసముద్రం చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. రమేష్  పరిశీలించారు. బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, బారికేడింగ్, వాహనాల రాకపోకలు, భద్రతా చర్యలపై పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు. భక్తులు పోలీసుల సూచనలు పాటించాలని, చెరువులోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.