హైదరాబాద్: 28°C
తెలంగాణ

జమ్ములమ్మ అమ్మవారికి శుక్రవారం ప్రత్యేక అలంకరణ

GDWL: గద్వాల పట్టణంలోని జమ్మిచేడులో వెలసిన శ్రీ జమ్ములమ్మ అమ్మవారికి శుక్రవారం పురస్కరించుకుని అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు.