హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటరు జాబితా సవరణ పక్కాగా జరగాలి: ఇళంబర్తి

VKB: జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్, ఎన్యూమరేషన్ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని ఓటర్ల జాబితా సవరణ అబ్జర్వర్ ఇళంబర్తి అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించిన అనంతరం ఆలంపల్లి, మోతీనగర్ పోలింగ్ కేంద్రాలను కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని, ఎలాంటి లోపాలు లేకుండా సర్వే పూర్తి చేయాలన్నారు.