హైదరాబాద్: 28°C
తెలంగాణ

సూరవీడు సర్పంచ్, ఉప సర్పంచ్‌పై సస్పెన్షన్ వేటు

MLG: వెంకటాపురం మండలం సూరవీడు సర్పంచ్ ఇరప మురళి, ఉప సర్పంచ్ మురళిపై సస్పెన్షన్ వేటు పడింది. పంచాయతీ నిధుల దుర్వినియోగంపై వార్డు సభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో జిల్లా పంచాయతీ అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో పంచాయతీ నిధులు దుర్వినియోగమైనట్లు తేలడంతో కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ శుక్రవారం తెలిపారు.