MHBD: బయ్యారం మండల కేంద్రంలోని బయ్యారం పెద్ద చెరువు పూర్తిగా నిండడంతో మత్తడి, అలుగు పోస్తోంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చెరువుకు భారీగా నీరు చేరడంతో పరిసర ప్రాంతాలు జలకళను సంతరించుకున్నాయి. శుక్రవారం చెరువును చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పలువురు స్థానికులు చెరువు వద్ద సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.
తెలంగాణ
అలుగు పోస్తున్న పెద్ద చెరువు.. సెల్ఫీల సందడి


