KMR: బిక్కనూర్ మండల కేంద్రంలోని ప్రాచీన పుణ్యక్షేత్రం అనంత పద్మనాభస్వామి ఆలయంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి చతుర్దశి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమ పూజలు చేశారు. ప్రధాన అర్చకులు రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
తెలంగాణ
అనంత పద్మనాభస్వామి చతుర్దశి వేడుకలు


