హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిన్నారంలో కోతుల బీభత్సం

SRD : జిన్నారం మున్సిపల్ కేంద్రంలో కోతుల బెడద పెరిగింది. పెద్ద సంఖ్యలో కోతులు గుంపులుగా సంచరిస్తూ హల్‌చల్ చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గతంలో చిన్నారులు, వృద్ధులు, మహిళలపై కోతుల దాడులు జరిగినట్లు స్థానికులు తెలిపారు. కోతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు, అటవీశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.