హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూరాలకు మొదలైన వరద ప్రవాహం

GDWL: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గద్వాల ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం ప్రారంభమైంది. శుక్రవారం జలాశయానికి 7,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా..నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా లిఫ్టులు మరియు ప్రధాన కాలువలకు కలిపి మొత్తం 5,601 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు.