హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మధ్యాహ్న భోజన పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి'

SRCL: మధ్యాహ్న భోజన నిర్వాహకుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేసి సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ నిర్వాహకులు చేపట్టిన నిరవధిక సమ్మె నిన్న మూడో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమ్మెలో మండలంలోని అన్ని గ్రామాల నిర్వాహకులు పాల్గొన్నారని తెలియజేశారు.