PDPL: రామగుండం నియోజకవర్గం ఎన్‌టీపీసీలో నిర్వహించిన వినాయక నిమజ్జన వేడుకల్లో ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులతో కలిసి సందడి చేస్తూ గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
వినాయక నిమజ్జనంలో పాల్గొన్న ఎమ్మెల్యే


