SRD: పటాన్‌చెరు మండలం రుద్రారం శివారులోని ప్రసిద్ధ శ్రీ గణేష్ గడ్డ ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 12వ రోజైన శుక్రవారం శ్రీ సిద్ధి వినాయక స్వామివారు సకల ఫలదాతగా నానావిధ ఫలములతో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. వివిధ రకాల కూరగాయలు, సుగంధ పుష్పాలతో నయనమనోహరంగా అలంకరించి మహామంగళహారతి, నైవేద్యం సమర్పించారు.
తెలంగాణ
సకల ఫలదాతగా సిద్ధి వినాయకుడి దివ్య దర్శనం


