JN: కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలో నిబంధనలు అతిక్రమించి డీజే వినియోగించడంతో స్థానిక పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. గణేష్ నిమజ్జన శోభాయాత్రలో పోలీసుల ఆదేశాలను ఉల్లంఘించి డీజే సౌండ్ సిస్టమ్‌ను వినియోగించారు. నిబంధనలకు విరుద్ధంగా డీజే ఏర్పాటు చేయడంతో పోలీసులు డీజే సౌండ్ సిస్టమ్‌తో పాటు వాహనాన్ని సీజ్ చేశారు. నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.
తెలంగాణ
డీజే సౌండ్ సిస్టమ్‌తో పాటు వాహనం సీజ్


