హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్షం పడితే ఆసుపత్రి మార్గాల్లో బురదనీరు

NLG: చిన్నపాటి వర్షం పడితే చాలు నల్గొండ జనరల్ ఆసుపత్రికి వెళ్లే రోగులు, వారి బంధువులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆసుపత్రికి ఉన్న మూడు ప్రవేశ మార్గాల్లో వర్షపు నీరు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ లేక బురదనీరు నిలిచిపోతోంది. నీరు ఆవిరయ్యే వరకు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. నెలలుగా సమస్య ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.