MHBD: జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తొర్రూరు నుంచి అన్నారం వెళ్లే దారిలోని భద్రకాళి దేవాలయం సమీపంలో ఓ చెట్టు కూలీ రోడ్డుపై పడిపోయింది. సమాచారం తెలుసుకున్న తొర్రూరు ఎస్సై తోట మహేందర్ రెడ్డి, తన సిబ్బందితో కలిసి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా చెట్టును తొలగించే చర్యలు చేపట్టారు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
రోడ్డుపై కూలిన చెట్టు... స్పందించిన పోలీసులు


