హైదరాబాద్: 28°C
తెలంగాణ

కారు ఢీకొని వ్యక్తి మృతి

BHNG: చౌటుప్పల్ లోని జాతీయ రహదారి దాటుతున్న వ్యక్తిని కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన గురువారం రాత్రి లింగోజిగూడెం వద్ద జరిగింది. ఒడిశాకు చెందిన కేవత్(37) గణేశ్ నిమజ్జనం చూసేందుకు ఎన్‌హెచ్-65 దాటుతుండగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు ఢీకొట్టింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ మన్మథకుమార్ తెలిపారు.