సూర్యాపేట: నడిగూడెం మండల కేంద్రంలో నాలాల ఆక్రమణలతో వర్షపు నీరు వెళ్లే మార్గం లేక లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరుతోంది. రెండు రోజులుగా కురిసిన వర్షానికి పలు ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పరిస్థితిని మండల ప్రత్యేక అధికారి, డీఎఫ్‌ఓ దామోదర్‌రెడ్డి పరిశీలించారు. మూడు రోజుల్లో ఆక్రమణలు తొలగించి నాలాలను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
నాలాల ఆక్రమణలతో ఇళ్లలోకి వరద నీరు!


