SRPT: అకాల వర్షానికి ఓ మహావృక్షం గురువారం నేలకొరిగింది. ఎన్నో ఏళ్లుగా గ్రామస్తులకు నీడనిస్తూ తరతరాల జ్ఞాపకాలకు సాక్ష్యంగా నిలిచిన మర్రిమాను ఒక్కసారిగా కూలిపోవడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మఠంపల్లి మండల పరిధిలోని రఘునాధపాలెం గ్రామ శివారులో కృష్ణాపురం వెళ్లే మార్గం మధ్యలో ఉన్న ఈ మర్రిమాను గ్రామస్తులతో విడదీయలేని అనుబంధాన్ని కలిగి ఉంది.
తెలంగాణ
అకాల వర్షానికి కూలిన మహావృక్షం


