NLG: నీట్ పీజీ -2026 విభాగంలో మిర్యాలగూడ మండల పరిధిలోని మైనంవారి గూడెం గ్రామానికి చెందిన మైనం భవ్య జాతీయ స్థాయిలో 698 ర్యాంకు సాధించారు. గురువారం రాత్రి వెలువడిన నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ఫలితాలలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకు సాధించారు. భవ్య ఇంటర్మీడియట్‌లో రాష్ట్రస్థాయి 3వ ర్యాంకు, ఎంబీబీఎస్‌లో గోల్డ్ మెడల్ సాధించారు.
తెలంగాణ
నీట్ పీజీలో 698 ర్యాంక్ సాధించిన భవ్య


