NLG: నాగార్జునసాగర్ ఎడమ కాల్వలకు నీటి విడుదలను అధికారులు గురువారం రాత్రి నిలిపివేశారు. నల్గొండ జిల్లాలో గణేష్ నిమజ్జనం కోసం బుధవారం మధ్యాహ్నం ఎడమ కాల్వకు సుమారు 5000 క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. నిమజ్జన కార్యక్రమం పూర్తి కావడంతో తిరిగి ఎడమకాల్వకు నీటి విడుదలను ఆపివేసినట్లు అధికారులు తెలియజేశారు.
తెలంగాణ
ఎడమ కాల్వకు నీటి విడుదల నిలిపివేత


