NGKL: తాడూర్ మండలం గోవిందాయపల్లిలో వినాయక నిమజ్జన వేడుకలు గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. నిమజ్జనానికి ముందు మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా కోలాటాలు, బతుకమ్మ, నృత్యాలు చేశారు. పాటలకు అనుగుణంగా ఆడుతూ సందడి చేశారు. అనంతరం భక్తిశ్రద్ధలతో గ్రామ సమీపంలోని చెరువులో గణనాథుడిని నిమజ్జనం చేసినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.
తెలంగాణ
ఆకట్టుకున్న కోలాట ప్రదర్శన


