హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే

VZM: భారీ వర్షాల నేపథ్యంలో ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ రాజాం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ముంపు ప్రాంతాలను పరిశీలించారు. రామారాయపురం, అరసాడల్లో మునిగిన పంటపొలాలను పరిశీలించి, నష్ట నివేదికలను సీఎం చంద్రబాబు, వ్యవసాయ మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. రైతులకు పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.