హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పర్చూరులో గర్భిణులకు సామూహిక సీమంతాలు

BPT: పర్చూరు ప్రాజెక్టు కార్యాలయంలో గర్భిణులకు సామూహిక సీమంతాల కార్యక్రమం నిర్వహించారు. అంగన్‌వాడీలు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి ఎస్.సువర్ణ సూచించారు. మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి పథకాలపై అవగాహన కల్పిస్తూ.. బాలల కోసం 1098, మహిళల కోసం 181 హెల్ప్‌లైన్లను ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో జి.సుభద్ర పాల్గొన్నారు.