TPT: వెంకటగిరి ఎస్సైగా ఎస్.కె. ఖాదర్ భాషా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధులను సమర్థవంతంగా, సకాలంలో నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. పోలేరమ్మ తల్లి జాతర నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు, భద్రతా చర్యలు చేపడతామని తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వెంకటగిరి ఎస్సైగా ఖాదర్ భాషా బాధ్యతలు


