హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్షపు నీటిలో మోడల్ స్కూల్

SDPT: బెజ్జంకి మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌ ప్రాంగణం వర్షపు నీటితో జలమయమైంది. ఇటీవల కురిసిన వర్షాలకు పాఠశాల ఆవరణలో భారీగా నీరు నిలిచి చెరువును తలపిస్తోంది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలలోకి రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ, ఇతర శాశ్వత చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.