హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈదురుగాలుల బీభత్సం.. నేలకూలిన భారీ చెట్లు

MHBD: మహబూబాబాద్ పట్టణంలో గురువారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. బలమైన గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడి పలు ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లాయి. రహదారులపై చెట్లు విరిగి పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సిబ్బంది, సంబంధిత అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.