SRCL: ఎల్లారెడ్డిపేట మండలం పదిరలో హత్యకు గురైన వివాహిత కుటుంబానికి సర్పంచ్ బోనాల మణెమ్మ రూ.15 వేల ఆర్థిక సాయం గురువారం అందజేశారు. మృతురాలికి ముగ్గురు చిన్నారులు ఉండటంతో వారి చదువుకు అండగా ఈ సాయం అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బోనాల సాయికుమార్, రేపాక రామచంద్రారెడ్డి, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
హత్యకు గురైన వివాహిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత


