హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీసీసీ ఆర్గనైజేషన్ ఇంఛార్జ్‌గా బెజ్జంకి అనిల్

ADB: కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం కోసం చేపట్టిన 'సంఘటన్ సృజన్ అభియాన్' కార్యక్రమంలో భాగంగా, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆర్గనైజేషన్ ఇంఛార్జ్‌గా బెజ్జంకి అనిల్ కుమార్ నియమితులయ్యారు. ఏఐసీసీ, టీపీసీసీ అధ్యక్షుల సూచనల మేరకు DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ గురువారం నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ పటిష్టత కోసం పనిచేస్తానని అనిల్ కుమార్ పేర్కొన్నారు.