హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మెరిసిన సాగరతీరం

కృష్ణా: మచిలీపట్నంలోని మంగినపూడి తీరంలో 63 అడుగుల మహాగణపతి వద్ద గురువారం రాత్రి అద్భుతమైన క్రాకర్స్ షో నిర్వహించారు. గణపతి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం భక్తులను, సందర్శకులను ఆకట్టుకుంది. వివిధ రకాల బాణసంచా వెలుగులతో తీర ప్రాంతం మెరిసిపోయింది. ఆకాశంలో రంగురంగుల వెలుగులు విరజిమ్మడంతో సందర్శకులు కేరింతలు కొట్టారు.