HNK: హన్మకొండ నగరంలో ఇంట్లో బంధించబడి నిరసన చేస్తున్న గూడూరు జయశ్రీకి న్యాయం చేయాలని ప్రజా సంఘాల నాయకులు కోరారు. గురువారం సుబేదారి ఎస్సై సుమకు వినతిపత్రం అందజేశారు. గతంలో గృహహింస, అదనపు కట్నం వేధింపులపై కేసు నమోదైందని తెలిపారు. ప్రస్తుతం జయశ్రీ, ఆమె కుమార్తెను ఇంట్లో బంధించారని ఆరోపిస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
జయశ్రీకి న్యాయం చేయాలని వినతి


