కరీంనగర్‌లో గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిందని సీపీ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. ఆరు కేంద్రాల్లో 2,252 విగ్రహాలు నిమజ్జనమయ్యాయని వెల్లడించారు. మానకొండూర్‌లో 850, చింతకుంటలో 740, కొత్తపల్లిలో 550 ప్రతిమలు నిమజ్జనం చేశారన్నారు. ఈ ప్రక్రియ విజయవంతానికి సహకరించిన ప్రజలకు, పోలీసులతో పాటు వివిధ శాఖల సిబ్బందికి సీపీ కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
2,252 విగ్రహాల నిమజ్జనం పూర్తి: సీపీ


