హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రత్యేక అధికారిగా బాధ్యత స్వీకరణ

PPM: కొమరాడ మండల ప్రత్యేక అధికారిగా వై. విమల గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆమె జిల్లా మార్కుఫెడ్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మండల పరిషత్ అధ్యక్షుల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. అందులో భాగంగానే విమల కొమరాడ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు చేపట్టారని ఎంపీడీవో కార్యాలయ వర్గాలు తెలిపాయి.