హైదరాబాద్: 28°C
తెలంగాణ

సరూర్‌నగర్ ట్యాంక్‌లో నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

RR: సరూర్‌నగర్ ట్యాంక్ వద్ద గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను ఎల్‌బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ పరిశీలించారు. నిమజ్జనానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.