హైదరాబాద్: 28°C
క్రీడలు

సూర్యవంశీపై కివీస్ కోచ్ కీలక వ్యాఖ్యలు

అక్టోబర్ 22 నుంచి భారత్-న్యూజిలాండ్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆటపై కివీస్ కోచ్ రాబ్ వాల్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పేస్, బౌన్స్ పిచ్‌లపై అతను ఎలా ఆడతాడో చూడాలని ఉందన్నాడు. IPLలో అదరగొట్టిన వైభవ్, విభిన్న పరిస్థితులకు ఎలా అలవాటు పడతాడనేది ఆసక్తికరంగా ఉందని చెప్పాడు. కివీస్ బౌలర్లు అతన్ని ఎలా కట్టడి చేస్తారో చూడాలని తెలిపాడు.