హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి'

SRCL: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. గురువారం హౌసింగ్, ఎంపీడీఓలు, ఏఈలు, డీఆర్డీఓతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 6,339 ఇళ్లకు ముగ్గు పోయగా, 5,294 బేస్‌మెంట్, 4,756 గోడల స్థాయికి, 4,467 స్లాబ్ స్థాయికి చేరుకున్నాయని, 3,832 ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు.