హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజేంద్రనగర్‌లో దారుణ హత్య

HYD: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు సమాచారం. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితులను గుర్తించేందుకు పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.