హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్య'

JGL: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని ఎంఈఓ సిరుప నాగభూషణం అన్నారు. బీర్పూర్ ప్రాథమిక పాఠశాలలో ఐసీటీ కంప్యూటర్ ల్యాబ్‌ను గ్రామ సర్పంచ్ ఎలమట్ల హరీశ్‌తో కలిసి గురువారం ప్రారంభించారు. పీఎం శ్రీ పథకంలో భాగంగా పాఠశాలకు 4 కంప్యూటర్లు, 8 హెడ్ సెట్స్ మంజూరయ్యాయని పేర్కొన్నారు. ఇవి డిజిటల్ ఎడ్యుకేషన్‌కు ఉపయోగపడతాయన్నారు.