హైదరాబాద్: 28°C
తెలంగాణ

తప్పుడు ఆరోపణలు చేస్తే వదలం: హరీష్

HYD: ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయలేక కాంగ్రెస్‌ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. నాంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. భవిష్యత్తులో ఎవరైనా నిరాధారమైన ఆరోపణలు చేస్తే.. శిక్ష పడే వరకు పోరాడుతామని హరీష్ రావు స్పష్టం చేశారు.