హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్ బీచ్‌లో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

కాకినాడ రూరల్ పరిధిలో ఎన్టీఆర్ బీచ్‌లో జరుగుతున్న గణేశ్ నిమజ్జనాలను జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ పరిశీలించారు. వర్షం కారణంగా నిమజ్జన కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు.