కోనసీమ: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కొత్తపేట మండల వీఆర్ఏలు గురువారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావును కలిశారు. తెలంగాణ తరహా పే స్కేల్ అమలు, నామినీ వీఆర్ఏల రెగ్యులరైజేషన్, అర్హులకు ప్రమోషన్లు కల్పించాలని వినతిపత్రం అందించారు. అమరావతి వీఆర్ఏలకు గృహాలు నిర్మించి ఇవ్వాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యేను కలిసిన వీఆర్ఏలు


