హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళల భద్రతపై అవగాహన

KDP: కొండాపురం పోలీసుల ఆధ్వర్యంలో తిమ్మాపురం సర్కిల్‌లో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డయల్‌ 112, శక్తి యాప్‌ సేవలతో పాటు సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తు తెలియని లింకులు, కాల్స్‌ నమ్మవద్దని, OTP, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించారు. సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు.