హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రవాహాలతో రిజర్వాయర్లు, చెరువులు నింపాలి'

GNTR: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో వస్తున్న ప్రవాహాలను ఒడిసిపట్టి రిజర్వాయర్లు, చెరువులు, ఇతర నీటి వనరులను నింపాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కృష్ణా, గోదావరి డెల్టాలతో పాటు ప్రాజెక్టుల దిగువన ఉన్న నీటి వనరుల్లోనూ వర్షపు నీటిని నిల్వ చేయాలని సూచించారు. అవసరమైన చోట మొబైల్‌ లిఫ్ట్‌లతో నీటిని తరలించాలని ఆదేశించారు.