హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మొగల్తూరులో నీటమునిగిన ఆదిలక్ష్మి కాలనీ

W.G: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మొగల్తూరు పంచాయతీ పరిధిలోని పేటపల్లిలో ఆదిలక్ష్మి అమ్మవారి కాలనీ నీటమునిగింది. మోకాళ్ల లోతు నీరు నిలవడంతో కాలనీవాసులు బయటకు వెళ్లేందుకు మార్గం లేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి నిలిచిపోయిన నీటిని బయటకు తోడి, డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.