ASR: కొయ్యూరు మండలం గింజర్తి, లుబ్బర్తి రిజర్వాయర్లను ఎస్‌ఎంఐ ఏఈ రామకృష్ణ గురువారం పరిశీలించారు. భారీవర్షాల నేపథ్యంలో నీటినిల్వలు, ప్రవాహ పరిస్థితి పరిశీలించి, ప్రస్తుతం రెండు రిజర్వాయర్లలో నీటి మట్టాలు సాధారణంగా ఉన్నాయన్నారు. ముంపు ముప్పు, నిర్మాణపరమైన సమస్యలు లేవని, నీటి ప్రవాహాలు అదుపులో ఉన్నాయన్నారు. రైతులు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
రిజర్వాయర్లకు ముప్పు లేదు


