BDK: కరకట్ట వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను ఎస్పీ రోహిత్ రాజు పరిశీలించారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా బారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ, రూట్ డైవర్షన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. గజ ఈతగాళ్లు, రెస్క్యూ, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. నదిలోకి ప్రమాదకరంగా దిగొద్దని, పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.
తెలంగాణ
గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు


