హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేంపల్లిలో ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

KDP: వైస్సార్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం గురువారం నిర్వహించారు. ప్రిన్సిపల్ డా. ఉషశ్రీ మాట్లాడుతూ.. సమాజ సేవలో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలన్నారు. సేవా భావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఎన్ఎస్ఎస్ ద్వారా విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, మానవతా విలువలు పెంపొందుతాయని తెలిపారు. గర్భిణులకు పండ్లను పంపిణీ చేశారు.