హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధికారిక లాంఛనాలతో ఎస్సై అంత్యక్రియలు

WGL: రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన ఎస్సై కునుసోతు వెంకన్న హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం బందోబస్తు విధుల్లో ఉండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన పార్థివదేహాన్ని గురువారం స్వగ్రామానికి తీసుకురావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పోలీసు అధికారులు నివాళులర్పించారు. అనంతరం పోలీసు శాఖ ఆధ్వర్యంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.