ఆసియా క్రీడల్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో సీమా కుమారి కాంస్య పతకం కైవసం చేసుకుంది. మహిళల 10,000 మీటర్ల రేసును ఆమె 32 నిమిషాల 50.05 సెకన్లలో (32:50.05) పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. కాగా, ఆసియా క్రీడల్లో మహిళల 10,000 మీటర్ల ఈవెంట్‌లో భారత్‌కు పతకం దక్కడం గత 16 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిగా 2010లో కవితా రౌత్ రజతం సాధించింది.
క్రీడలు
చరిత్ర సృష్టించిన భారత అథ్లెట్


