హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మృతి

HYD: ప్రణయ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న అబ్దుల్ బారీ చర్లపల్లి జైలులో మృతి చెందాడు. ఛాతిలో నొప్పి రావడంతో జైలు అధికారులు అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలో బారీ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో 2025 మార్చిలో నల్గొండ కోర్టు బారీతో పాటు మరో ఐదుగురికి జీవిత ఖైదు విధించగా, కాంట్రాక్ట్ హంతకుడు సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష విధించింది.