హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఈసీ అరెస్టుకు యూత్ కాంగ్రెస్ డిమాండ్

JN: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం జనగామ ఆర్టీసీ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు జక్కిరెడ్డి శివచరణ్ రెడ్డి పాల్గొని ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు సంబంధించి సీఈసీ తీరుపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో జ్ఞానేష్ కుమార్‌‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.